ఎమ్మెల్యేని సన్మానించిన కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్
NZB: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్, డిస్టిక్ట్ సెక్యురిటీ కౌన్సిల్ మెంబర్ రజనీకాంత్ శనివారం కలిశారు. హైదరాబాద్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు సుదర్శన్ రెడ్డి పెద్ద దిక్కు అన్నారు. సీనియర్ నాయకుడికి పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు.