ఫర్టిలైజర్స్ షాపులలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

JN: పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాప్‌లను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో యూరియా కొరత లేదని, ఈ రోజుకి 200 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఈ వారంలో 1800 మెట్రిక్ టన్నుల యూరియా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.