తిమ్మాపురం సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం
SRPT: చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వల్లపు దాసు జానయ్య ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 250 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.