మెస్సీ-గోట్ మ్యాచ్.. పాసులుంటేనే అనుమతి!

మెస్సీ-గోట్ మ్యాచ్.. పాసులుంటేనే అనుమతి!

TG: మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో HYD ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా రాచకొండ CP సుధీర్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 13న జరగనున్న మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.