VIDEO: డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన
KMR: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బాన్సువాడ డిపో వద్ద మంగళవారం రాత్రి ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం, యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో బుధవారం ఉదయం మొదటి డ్యూటీ నుంచే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని నాయకులు స్పష్టం చేశారు.