ప్రభుత్వ హాస్పిటల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

KDP: మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవుట్ పోస్ట్, డయాలసిస్ సెంటర్, పోస్టుమార్టం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల పనితీరు చాలా బాగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర, మిల్లుశీను పాల్గొన్నారు.