పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి: మండల అధ్యక్షుడు
HNK: బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని మండల పార్టీ అధ్యక్షుడు రాజుకుమార్ అన్నారు. దామెర మండలంలోని ఒగ్లాపూర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు పార్టీ జెండాను బీజేపీ నేతలు ఆవిష్కరించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు.