హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..!

హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు..!

HYD: హైకోర్టుకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. కోర్టు ఆవరణలోని వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి కోర్డులకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే.