జ్యూట్ బ్యాగ్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

WGL: పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను వాడాలని అందులో భాగంగా జ్యూట్ బ్యాగులు వినియోగించాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలో మహిళలకు జ్యూట్ బ్యాగ్ శిక్షణ కార్యక్రమానికి హాజరై మహిళలు ఇంటి వద్దనే రంగురంగుల జ్యూట్ బ్యాగులు తయారు చేస్తూ ఉపాధి ,ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని, సామాజిక బాధ్యతతో జ్యూట్ బ్యాగులను వాడాలని పేర్కొన్నారు.