కురుమద్దాలి అండర్ పాస్ శిథిలం

కురుమద్దాలి అండర్ పాస్ శిథిలం

కృష్ణా: పామర్రు మండలం కురుమద్దాలి గ్రామం వద్ద ఉన్న అండర్ పాస్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ రహదారిపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచిపోయి గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.