'అవయవ దానంతో మరో వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చు'

KRNL: అవయవ దానం మానవతా కోణంతో చేసే ఒకగొప్ప పని అని, అవయవ దానంతో మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వొచ్చు అని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అవయవ దానం ద్వారా అవసరమైన వారికి కొత్త జీవితం అందించవచ్చని పేర్కొన్నారు.