అలర్ట్... నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు

అలర్ట్... నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు

AP: రాష్ట్ర ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని కడప జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.7 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.