శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: ఎస్సై
BPT: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని చుండూరు ఎస్సై చంద్రావతి శుక్రవారం తెలిపారు. మండలంలో నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.