కుట్టు శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి: కలెక్టర్

PDPL: కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుక రావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని పాత పాల కేంద్రంలో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు పనులను కలెక్టర్ పరిశీలించారు. మంథని పట్టణ ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ అందించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్న ట్రైనింగ్ సెంటర్- 3 రోజులలో పూర్తి చేయాలన్నారు.