హోంగార్డు రంజిత్‌కు నివాళులర్పించిన ఎస్పీ
BHPL: పట్టణానికి చెందిన హోంగార్డు రంజిత్ అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ క్రమంలో ఇవాళ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ రంజిత్ మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.