శ్రీలంకకు సాయం.. పాక్‌పై విమర్శలు

శ్రీలంకకు సాయం.. పాక్‌పై విమర్శలు

దిత్వా తుపానుతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయం చేసి పాక్ విమర్శల పాలవుతుంది. శ్రీలంకకు పాక్ అండగా ఉంటుందంటూ ఆ దేశ హైకమిషన్ సహాయ ప్యాకేజీలను పోస్ట్ చేసింది. అయితే ఆ ప్యాకేజీలపై ఎక్స్‌పైరీ డేట్ 10/2024గా ఉంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాక్ గతంలోనూ టర్కీకి కూడా ఇలాగే కాలం చెల్లిన ఆహారాన్ని పంపించిందంటూ దుయ్యబడుతున్నారు.