మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదు: ప్రిన్సిపల్

మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదు: ప్రిన్సిపల్

కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ స్పష్టం చేశారు. సీనియర్ విద్యార్థుల మధ్య మనస్పర్థల వల్ల ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్ విద్యార్థి పేరుతో తప్పుడు మెయిల్ పంపాడని విచారణలో తేలిందన్నారు. నిందితుడిని గుర్తించి హాస్టల్ నుంచి పంపించేశామని వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.