విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక
VSP: జిల్లా పోలీసులు విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాగింగ్ ఒక సామాజిక నేరమని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులను అవమానించడం, భయపెట్టడం లేదా వేధించడం వంటివి ర్యాగింగ్ కిందికి వస్తాయన్నారు. ఇది చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. "స్నేహాన్ని పెంచండి-ర్యాగింగ్‌ను అరికట్టండి" అని పోలీసులు పిలుపునిచ్చారు.