మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే
KKD: ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్‌ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై విపులంగా చర్చించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటికి తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.