హనుమద్రత మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీ
కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమద్ర్వత మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొనుకు గౌతమి, చింతా భాస్కరరావు, గూటం సత్యనారాయణ, మద్దా వినోదరావు, కాశి చిరంజీవి పాల్గొన్నారు.