డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వినతి..!
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కాలనీ అధ్యక్షుడు రచ్చ రాహుల్ మంగళవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. 16వ బ్లాక్ నుంచి 33వ బ్లాక్ వరకు దుర్గంధం వెదజల్లుతుందని వినతి పత్రంలో పేర్కొన్నాడు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.