రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో KTR పర్యటన

KMM: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కేటీఆర్ ఉదయం 11 గంటలకు ఖమ్మం చేరుకొని కవిరాజునగర్‌లోని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కరకగూడెం వెళ్లి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పరామర్శిస్తారు.