రేపు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం

GNTR: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు "డయల్ యువర్ కమిషనర్" కార్యక్రమం (ఫోన్: 0863-2224202) కమిషనర్ చాంబర్‌లో నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ప్రకటించారు.