VIDEO: రామప్ప వాన గుట్ట వద్ద పులి సంచారం

VIDEO: రామప్ప వాన గుట్ట వద్ద పులి సంచారం

MLG: వెంకటాపూర్ మండలంలోని రామప్ప వాన గుట్ట వద్ద నాలుగు రోజుల క్రితం పులి అరుపులు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ నెల 8న తెల్లవారుజామున చెంచు కాలనీ సమీపంలోని కోళ్ల ఫారంలో పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పులి ఇప్పటికీ వాన గుట్ట వద్ద సంచరిస్తున్నట్లు గురువారం స్థానికులు పేర్కొన్నారు. ఈ సమస్య పై అధికారులు స్పందించాలని కోరారు.