నీటి సమస్య తీర్చాలని తహసీల్దారుకు గ్రామస్థుల వినతి
KRNL: పెద్దకడబురు మండల కేంద్రంలోని బైపాస్ నుంచి కురువ గేరి వరకు దాదాపు 12 రోజులైన తాగునీరు అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని కాలనీవాసులు తహసీల్దార్ వలీభాషాకు సోమవారం వినతిపత్రం అందజేశారు. సమస్యపై పంచాయతీ కార్యదర్శి, RWS అధికారులకు తెలిపిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా ప్రజలకు నీరు అందించాలని కోరారు.