ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మద్యం, డ్రగ్స్ జోరు
త్వరలో అసోం, కేరళం, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో మద్యం, డ్రగ్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులు రూ.408.82 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.167.38 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.17.44 కోట్ల నగదు, రూ.37.68 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.