శ్రీభక్తాంజనేయ దేవాలయంకు ఏసీ బహుకరణ

SRPT: సూర్యాపేటలోని తహశీల్దార్ రోడ్డులో గల అతి పురాతనమైన శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయంకు ఎల్గురి లక్ష్మీ నరసింహ గౌడ్ మంగళవారం ఏసీ బహుకరించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూతన ఏసీని ప్రారంభించారు. ఏసీని బహుకరించిన వైఎల్ఎన్ గౌడ్‌ను అభినందించారు.