VIDEO: పెనుకొండలో అధికారులతో సమావేశమైన ఆర్డీవో
సత్యసాయి: పెనుకొండలో రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్ తెలిపారు. శనివారం పెనుకొండలో ఆర్డీవో మాట్లాడుతూ.. మహిళల సాధికారత, సమాన హక్కులు వారి అభివృద్ధికి ప్రాధాన్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళల ఆరోగ్యం, విద్య, స్వయం ఉపాధి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.