పవన్ పర్యటనలో అపశ్రుతి
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో.. ఒక్కసారిగా పవన్‌ని చూడటానికి స్థానికులు కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చారు. ఈ తోపులాటలో ఓ మహిళ కింద పడగా.. ఆమె కాలిపై నుంచి వాహనం వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెనక్కి లాగారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు.