భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న సంక్షోభాన్ని విమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దుబాయ్ నుంచి ముంబైకి నడిచే నాన్ స్టాప్ విమానాల టికెట్ రేట్లను మార్చి 10-15 మధ్య ఏకంగా రూ.45-65వేలకు(సాధారణంగా రూ.10-20వేలు) పెంచాయి. ఇతర ప్రధాన నగరాలకూ ఇదే తరహా ధరలు ఉన్నాయి. ఇండిగో, ఎయిరిండియా, ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా ఒకదానికొకటి పోటీ పడి వసూలు చేస్తున్నట్లు సమాచారం.