VIDEO: నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లాలోని కరెంట్ డిపార్ట్‌మెంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను, నూతన విద్యుత్ లైన్‌ను మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 13 ట్రాన్స్‌ఫార్మర్‌లు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. ఎండాకాలంలో కరెంట్ సమస్య రాకుండా రూ. 3.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశామన్నారు.