జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గర్భిణీ మృతి

బుస్సాపూర్ NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం. ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి నదికి పూజలు చేసేందుకు వెళ్తున్నారు. రహదారి మధ్యలో ఉన్న పువ్వులు తెంపడానికి భార్య వెళ్లింది. తిరిగి ఆటో వద్దకు వెళ్లే క్రమంలో ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.