తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: సీఐ

తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: సీఐ

కర్నూలు: రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని కర్నూలు తాలూకా సీఐ తేజా మూర్తి తెలిపారు. హెల్మెట్‌ ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచం అని పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హెల్మెట్‌ వాడకం, దాని ప్రయోజనాలను సీఐ వివరించారు.