YCPకి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టింది: MLA

YCPకి నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టింది: MLA

GNTR: YCPకి నేను అన్నం పెడితే ఆ పార్టీ నాకు సున్నం పెట్టిందని MLA యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నిన్న మచిలీపట్నం కోర్టుకు హాజరై ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నందుకు తనపై YCP హయాంలో హత్యాయత్నం, SC, ST అట్రాసిటీ కేసులు పెట్టారని మండిపడ్డారు. దీంతో 18 నెలలు పాస్‌పోర్ట్‌ నిలిచిపోయిందని, USలో వ్యాపారాలు ఉన్నా వెళ్లి చూసుకోలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.