తగ్గు ముఖం పట్టిన కొల్లేరు

ELR: మండవల్లి మండలంలో కొల్లేరు ఉద్ధృతి ఆదివారం కొద్ది మేర తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతం నుంచి డ్రైన్ల ద్వారా కొల్లేరులోకి వరద నీరు వచ్చి చేరడంతో నిన్న పెద ఎడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం 2.5 మీ. ఉండగా, ఆదివారం సాయంత్రం 2.4 మీ. చేరింది. మణుగునూరు - పెనుమాకలంక రహదారి సుమారు 200మీ. మేర ముంపులో ఉండగా, రోడ్డుపై అడుగు ఎత్తులో నీరు ప్రవహిస్తుంది.