మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నిర్వహించనున్న పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్యేక అధికారి తూప్రాన్ ఆర్డీవో జయేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు పాలకవర్గం కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేస్తారని, అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.