ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య పరిక్షలు
SDPT: బెజ్జంకి మండలంలోని చీలాపూర్ పల్లిలో ఆరోగ్య తెలంగాణ కార్యక్రమం కింద గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ ఎర్రవెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకారంతో ప్రజలకు వైద్య సేవలు చేరడం సంతోషకరమన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం సరోజ ఉన్నారు.