'పది'లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్
KRNL: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సోమవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. కర్నూలు, ఆలూరు, రాతన గ్రామాల ఆశ్రమ పాఠశాలలకు చెందిన 64 మంది విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.