విశాఖలో ‘శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్’
విశాఖలో (ఈనెల 25న) ఆదివారం ఉదయం 'శ్రీ సత్యసాయి రన్ అండ్ రైడ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఐక్యత, సేవ అనే సందేశంతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పరుగులో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.