అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ పనులు ప్రారంభం..!

MDCL: అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఫైర్ స్టేషన్ మంజూరు కోసం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయటం, జూలై 6, 2025న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించగా, కృషి ఫలించిందని పేర్కొన్నారు. పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.