VIDEO: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క

ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. మేడారం జంపన్న వాగు గోదావరి నది ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించారు. పరిస్థితులు అడిగి తెలుసుకుంటూ, అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని బాధితులకు ధైర్యం చెప్పారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.