విరిగిన విద్యుత్ స్తంభం

విరిగిన విద్యుత్ స్తంభం

ప్రకాశం: పొదిలి మండలం నంది పాలెం గ్రామ పరిసరాల్లో సోమవారం సాయంత్రం పిడుగులతో కూడిన ఈదురుగాలుల వర్షానికి విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. విషయాన్ని స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు ప్రారంభించారు.