టర్ఫ్ పిచ్లపై జిల్లాలో తొలిసారి అండర్-12 క్రికెట్ సెలక్షన్స్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలిసారిగా తిరుపతి డివిజన్లో టర్ఫ్ పిచ్లపై అండర్-12 క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించినట్లు సీడీసీఏ అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి సతీష్ యాదవ్ తెలిపారు. కరకంబాడి రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో జరిగిన ఎంపికల్లో 150 మంది క్రీడాకారులు పాల్గొనగా ప్రతిభ ఆధారంగా నాలుగు జట్లను ఎంపిక చేశారు.