యువతకు అగ్నివీర్‌ పథకంపై అవగాహన

యువతకు అగ్నివీర్‌ పథకంపై అవగాహన

SKLM: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నివీర్‌ పథకంపై యువత అవగాహన పెంచుకోవాలని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రతినిధులు ఎన్‌.సందీప్, దేవకాంత్‌ మిశ్రాలు అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అగ్నివీర్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. దేశ సేవలో నాలుగేళ్లు పాల్గొనే అవకాశం వస్తుందన్నారు.