ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మూర్తి బదిలీ
ASR: అరకులోయ మండలం, గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ టీఎస్ఎన్ మూర్తి పదోన్నతిపై అనకాపల్లి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయానికి బదిలీ అయ్యారు. మూర్తికి అనకాపల్లి డిప్యూటీ డీఈఎంవోగా పదోన్నతి ఇచ్చారు. ఈ మేరకు విశాఖపట్నం వైద్య ఆరోగ్య ప్రాంతీయ సంచాలకులు డా.రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు.