పారిశుద్ధ్య కార్మికుడిగా బైచిగేరి సర్పంచ్
KRNL: ఆదోని మండల పరిధిలోని బైచిగేరి సర్పంచ్ మహాదేవ చెత్త సేకరణ డ్రైవర్‌గా మారారు. మంగళవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికుడు డ్రైవర్ రాముడు కూతురుకు అనారోగ్యానికి గురైందని తెలుసుకొని వారిని హాస్పిటల్‌కు పంపి తను డ్రైవర్‌గా మారారు. దీనిపై గ్రామ ప్రజలు ఆశ్చర్య పోయారు. సర్పంచ్ చెత్త బండి డ్రైవర్‌గా మారాడంపై అభినందనలు తెలిపారు.