రహదారి సౌకర్యం లేక అవస్థలు

ASR: అనంతగిరి మండలానికి మారుమూల కివర్ల పంచాయతీ పరిది కొండశిఖరు నక్కులమామిడి పివిటిజీ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో 63 కుటుంబాలు 300మంది జనాభా జీవనం సాగిస్తున్నామని, రహదారి సౌకర్యం లేక రోగులకు, గర్భిణీలను ఆస్పత్రికి తరలించేందుకు డోలీలే ఆధారంగా మారిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటున్నారు.