కోనేరులో పడి మహిళ మృతి
MBNR: జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో ప్రమాదవశాత్తు పడి, వెంకటేశ్వర కాలనీకి చెందిన నాసు సాయమ్మ (60) మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ పేర్కొన్నారు.