VIDEO: 10 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
SKLM: సోంపేట మండలంలో ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్లం ఊటలను ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేశారు. ఎక్సైజ్ శాఖ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లో రెండు చోట్ల సుమారు 10 వేల లీటర్ల బెల్లం ఊటను శనివారం సిబ్బందితో కలిసి ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్రమ బెల్లం ఊట తయారు చేస్తా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.