చెక్ బౌన్స్ కేసులో నేరస్తురాలికి జైలు శిక్ష

MNCL: బెల్లంపల్లి పట్టణం రైల్వే కాలనీకి చెందిన సుహాసిని అనే మహిళకు చెక్ బౌన్స్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్ష, 2లక్షల 50వేల జరిమానా పడినట్లు వన్ టౌన్ సీఐ దేవయ్య మంగళవారం తెలిపారు. హనుమాన్ బస్తీకి చెందిన గురజాల సదానందం 2019లో ఫిర్యాదు చేయగా మంగళవారం నేరం రుజువు కావడంతో జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ముకేశ్ శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.